ఆప్‌ సంబరాలు.. కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్‌ 58 స్థానాల్లో(ఉదయం 11.30గంటలకు) స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ మంత్రులు కూడా ఆయా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆప్‌ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు.